స‌మ్మ‌ర్ బెర్తు కోసం పోటీ ప‌డుతున్న ముగ్గురు స్టార్ హీరోలు

ఆ ముగ్గురి ఎవ‌రికి వారే సాటి. ముగ్గురూ పెద్ద హీరోలే. సినిమా హిట్ కొడితే రికార్డులు వారి పేరుమీద రిజిస్ట‌ర్ అవుతాయి. మాస్ ఫాలోయింగ్ లో ముగ్గురూ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఇప్పుడు ఆ ముగ్గురు మ‌రోసారి పోటీ ప‌డుతున్నారు. వచ్చే స‌మ్మ‌ర్ కు త‌మ డ్రీమ్ ప్రాజెక్టుల‌తో హీటు పుట్టిస్తున్నారు. ఇప్ప‌టికే నేష‌న‌ల్ స్టార్ గా మారిన ప్ర‌భాస్‌, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌మ్మ‌ర్ బెర్త్ ను క‌న్ఫ‌ర్మ్ చేసుకున్నారు. దీంతో టాలీవుడ్ లో విధ్వంసానికి తెర‌లేచింది.


ప్ర‌శాంత్ నీల్ తో ప్ర‌భాస్ చేస్తున్న స‌లార్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచ‌నాలున్నాయి. ఇక సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబోలో నిన్న‌నే సినిమా ఫిక్స్ అయింది. ఏ మోస్ట్ వెయిటెడ్ సినిమాగా ఇది రూపొందుతోంది. ఇక ఎన్టీఆర్ త‌న 30వ సినిమాను బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో తీస్తున్నాడు. ఇవి మూడూ ఓ రేంజ్ లో అంచనాలున్న సినిమాలే.
ఇక ఈ ముగ్గురూ త‌మ సినిమాల‌ను వ‌చ్చే 2022స‌మ్మ‌ర్ లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌ర‌గ‌నుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇందుకోసం ఇప్ప‌టికే ఈ మూడు సినిమాలు ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం.. షూటింగ్ జ‌ర‌పుతున్నాయి. కొవిడ్ ఉన్న‌ప్ప‌టికీ షూటింగ్ షెడ్యూల్ ను మాత్రం వాయిదా వేయ‌ట్లేదు. దీంతో ముగ్గురి అభిమానులు ఇప్పుడే లెక్క‌లేసుకుంటున్నారు.