మళ్లీ కుమ్మేశాడు భయ్యా.. టిల్లు స్క్వేర్ డే-1 కలెక్షన్స్ ఎంతంటే?

-

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు యూత్ నీరాజనం పడుతున్నారు. టీజర్, ట్రైలర్ రిలీజ్ నుంచే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ వసూళ్లు మంచిగా వచ్చాయి. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.

ఇక ఈ సినిమా డే-1 కలెక్షన్లు చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.00 కోట్ల వరకు షేర్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలిపి రూ. 8.50 కోట్ల వరకు వచ్చిందట. ఓవర్సీస్లో డే1 గ్రాస్ రూ.10కోట్ల వరకు ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నార్త్ అమెరికాలో 950కే డాలర్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలిసింది. అంటే 1 మిలియన్ డాలర్స్కు చేరువగా ఉంది. ఓవరాల్గా ఫస్ట్ డే రూ. 20 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news