ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. మే మొదటి వారంలో పదవ తరగతి ఫలితాలు వెలువడనున్నట్లు సమాచారం అందుతుంది. పదవ తరగతి జవాబు పత్రాల వ్యాల్యుయేషన్ ను ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభించి ఎనిమిదో తేదీలోపు పూర్తి చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ తెలిపారు.
ఇందుకోసం 25,000 మంది సిబ్బందికి విధులు కేటాయించామని తెలిపారు. 6.23 లక్షల మంది రెగ్యులర్ , లక్ష మంది ప్రవేట్ పరీక్షలు రాశారని… 50 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ అనుమతితో మే మొదటి వారంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షలు పూర్తి అయిన సంగతి తెలిసిందే.