ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో క్యారెక్టర్ నటుడిగా కనిపించిన బ్రహ్మాజీ పరిచయం లేని పేరు. అయితే ఆయన తన కుమారుడి వివాహాన్ని గోవాలో సీక్రెట్‌గా జరిపించారు. భోపాల్ కు చెందిన ప్రమోద్ వర్మ, పూనమ్ కుమార్తె అనుకృతీ దీక్షిత్ తో బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ పెళ్లి జరిగింది. గోవాలోని ప్లానెట్ హాలీవుడ్ లో ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి సంజయ్ మిత్రులు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వెళ్లినట్టు సమాచారం. త్వరలోనే హైదరాబాద్ లో రిసెప్షన్ ను వైభవంగా జరిపించాలని బ్రహ్మాజీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే నటుడిగా తానేంటో నిరూపించుకున్న బ్రహ్మాజీ, తన కుమారుడిని వారసుడిగా వెండితెరకు పరిచయం చేయనున్నాడు. సంజయ్ నటించిన సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయి, త్వరలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇక తన కుమారుడి వివాహాన్ని లో ప్రొఫైల్ లో జరిపించడం వెనుక కారణాన్ని బ్రహ్మాజీ ఎక్కడా వెల్లడించలేదు.