వాడు అసలైన మగాడు.. వాళ్లు మృగాళ్లు: మహేష్ బాబు సంచలన ట్వీట్…..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో నటించడంతో పాటు తనవంతుగా పలు సామజిక సేవాకార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల 1000 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపిన సూపర్ స్టార్, తన ఫ్యాన్స్ ని చైతన్య పరుస్తూ తనవంతుగా కొన్ని ప్రకటనలు కూడా చేస్తుంటారు. ఇక మూడు రోజుల క్రితం దారుణంగా రేప్ చేయబడి, అనంతరం ఘోరంగా హత్యగావింపబడ్డ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై మహేష్ బాబు నేడు తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఎంతో ఉద్వేగభరితంగా ట్వీట్ చేయడం జరిగింది.

 

ఇప్పటివరకు పలు దారుణాలు, దుర్ఘటనలు బారిన పడి మరణించిన అమ్మాయిల ఆత్మకు శాంతి కలగాలని, అలానే వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ మన మనస్తత్వాల్లో మాత్రం మార్పు రావడం లేదు, సమాజంలో మనలోని కొందరి తప్పుడు ప్రవర్తనతో అమ్మాయిల జీవితాలు ఛిద్రం అవుతున్నాయి. ఇకనైనా మానవత్వం ఉన్న మనుషులుగా మారి అందరం కలిసి మెలిసి జీవిద్దాం.
అలానే ఇకనైనా అమ్మాయిల పట్ల జరిగే ఈ దారుణాలను అరికట్టడంతో పాటు, మన చట్టాలు మరియు అటువంటి తప్పులు చేసే

 

మృగాళ్లకు మరింత కఠిన శిక్షలు విధించేలా ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి నా వినతి అంటూ మహేష్ బాబు పోస్ట్ చేయడం జరిగింది. గతంలో ఆడవారి రక్షణపై ఉమెన్స్ డే నాడు తనవంతుగా ప్రచారం చేసిన మహేష్ బాబు, ఒక చెల్లికి అన్నగా, ఒక అక్కకు తమ్ముడిగా, ఒక తల్లికి బిడ్డగా వారిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మగవాడు ఎప్పుడూ రక్షణగా నిలవాలని, అతడే నిజమైన మగాడు అంటూ ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ట్వీట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది….!!