బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమ అరెస్టు

-

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన  బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్ సినీ నటి హేమను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం దర్యాప్తు చేపట్టిన కోర్,టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రేవ్ పార్టీ కేసులో ఆమె తనపై వచ్చిన ఆరోపణలకు తగిన సమాధానం చెప్పలేదని, అలాగే తాను డ్రగ్స్ తీసుకోలేదని వీడియో తీసి పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అసలేం జరిగింది అంటే..?

గత నెలలో కర్ణాటక బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీని అక్కడి పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు.. ఇందులో భాగంగా నటి హేమను తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. మే 27న రావాలని తొలుత నోటీసులు ఇవ్వగా, తనకు జ్వరం కారణంగా రాలేకపోతున్నానని, వారం రోజుల గడువు కావాలంటూ ఆమె కోరారు. జూన్ 1న విచారణకు రావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేశారు. అప్పుడూ డుమ్మా కొట్టడంతో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చి, విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news