రాహుల్ గాంధీ రెండు చోట్ల గెలిచేనా?

-

మరి కొన్ని గంటల్లో దేశ భవితవ్యం ఏంటో తేలిపోతుంది. రానున్న ఐదేళ్లు పాలనా పగ్గాలు ఎవరి చేతికి అందనున్నాయో తెలిసిపోతుంది. ఇవాళ ఉదయం లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖుల గెలుపుపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేస్తే ఒకచోట గెలిచిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఈసారి కూడా రెండు స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. 2019లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని తమ కంచుకోట అమేఠీలో కంగుతిన్న రాహుల్‌, ఈసారి మరో కంచుకోటైన రాయ్‌బరేలీ నుంచి తొలిసారి పోటీ చేశారు. ఇక్కడ రాహుల్‌ గెలుపుపై కాంగ్రెస్‌ పార్టీ ధీమాగా ఉంది. బీజేపీ తరఫున దినేశ్‌ ప్రతాప్‌ సింగ్ నిలిచారు.

గత ఎన్నికల్లో గెలిచిన కేరళలోని వయనాడ్‌ స్థానం నుంచి కూడా మరోసారి రాహుల్‌ పోటీ చేశారు. ఇక్కడ సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్నీ రాజా, బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కే సురేంద్రన్‌ రాహుల్‌కు ప్రత్యర్థులుగా ఉన్నారు. మరి ఈసారి రాహుల్ రెండు స్థానాల్లో గెలుస్తారా లేదా అనేది మరి కొద్ది గంటల్లో తేలుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news