నిన్న తమిళనాడు సీఎం తనయుడు మరియు మంత్రి ఉదయనిధి స్టాలిన్ హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యల పట్ల దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కు ఎటువంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పూర్తి బాధ్యత వహించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ జివిఎల్ మాట్లాడుతూ రాజకీయంగా ఏమాత్రము అనుభవం లేని బచ్చాగాళ్లు హిందూ ధర్మం గురించి చేసిన కామెంట్ ల వలన దేశంలోని ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ ఉదయనిధి చేసిన కామెంట్ ల పట్ల బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాలంటూ జివిఎల్ డిమాండ్ చేశారు.
ఇండియా కూటమిలో భాగమైన ఒక నేత ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ జివిఎల్ మండిపడ్డారు. బీజేపీని ఓడించలేక ఈ విధమైన వ్యాఖ్యలతో భారతదేశాన్ని విమర్శిస్తున్నారు అంటూ జివిఎల్ తన ఆవేదనను వినిపించారు.