హాలీవుడ్ లో టాలీవుడ్ కమెడియన్..!

-

టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణకు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. అతను ఓ హాలీవుడ్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. సిల్క్ రోడ్ అనే మూవీలో రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్ చేస్తున్నాడు. లాస్ ఏంజిల్స్ లో ఫిల్మ్ మేకర్ అయిన ప్రదీప్ కాటసాని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సైబర్ క్రైం, డ్రగ్స్ చుట్టూ తిరిగే ఈ సినిమా గురించి రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు రాహుల్ రామకృష్ణ.

అర్జున్ రెడ్డి సినిమాలో శివ పాత్రలో అలరించిన రాహుల్ రామకృష్ణ ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్ రైటర్ గా కెరియర్ ప్రారంభించిన రాహుల్ రామకృష్ణ అనుకోకుండా యాక్టర్ గా మారడం ఇప్పుడు ఆర్టిస్ట్ గా బిజీ అవడం జరిగింది. మరి రాహుల్ రామకృష్ణ చేస్తున్న ఈ సిల్క్ రోడ్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news