టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరక్టర్స్ బీ టౌన్ లో కళ్లు తేలేశారా ?

టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ పడింది కదా అని చెప్పి బిటౌన్ వరకు వెళ్లిన తెలుగు దర్శకులకు గట్టి దెబ్బలే తగులుతున్నాయి.ఈవెన్ బాలీవుడ్లో హిట్ వచ్చినా కూడా చేతిలో సినిమాలు లేకుండా పోవడం ఇక్కడ సీరియస్ గా థింక్ చేయాల్సిన విషయం. ఇంతకీ ఇక్కడ అక్కడ బోణీ కొట్టినప్పటికీ ఆఫర్లు కొట్టలేకపోతోన్న ఆ దర్శకుల పై ఇండస్ట్రీలో కొత్త చర్చ నడుస్తుంది.

టాలీవుడ్ యువ దర్శకులు విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ పోతున్నారు.వారిలో కొందరికి హిట్లు పడుతున్నాయి. ఇంకొందరికి ట్రెండ్ సెట్టర్లు కుదురుతున్నాయి.అలా వర్కవుటైన వారికి బాలీవుడ్ నుంచి కాల్ రావడం, అక్కడ హీరోలతో సినిమాలు చేయడం సర్వసాధారణమైపోయింది.అలా చేసినవారు కొందరు వెనక్కి వచ్చేస్తే… ఇంకొందరు అక్కడే మరో సినిమా చేయడానికి హీరోలకు స్టోరీలు వినిపించడానికి టైమ్ వేస్ట్ చేస్తున్నారు..ఇదే ఆయా దర్శకులకు పెద్ద డ్రాబ్యాక్ గా మారిపోయింది.

రన్ రాజా రన్ తో మంచి హిట్ అందుకున్న సుజిత్ ..సాహో సినిమాతో బిటౌన్ వరకు ఓకె అనిపించుకున్నాడు.టెక్పికల్ గా సినిమాను గ్రాండీగా తీర్చిదిద్దడంతో త్వరలో షారుక్ తో సినిమా అనుకున్పారు.ఆతర్వాత కపూర్ హీరోలతో సినిమా చేస్తున్నాడన్నారు. కట్ చేస్తే ఎవరితోను సినిమా లేకుండా పోయింది.చివరకు టాలీవుడ్ వచ్చి లూసిఫర్ చేద్దామన్నా ..ఆ ఆఫర్ తనకు దక్కకుండా పోయింది.దీంతో తన తర్వాత సినిమా ఎవరితో చేయాలో తెలియక ఇబ్బంది పడుతోన్న టైమ్లో చత్రపతి హిందీ రీమక్ కు ఆల్మోస్ట్ ఓకే అయినట్లుగా తెలుస్తుంది.

సుజిత్ మాదిరిగానే హిట్లు కొట్టినా కరెక్ట్ ఫిలింస్ లేక ఇబ్బంది పడుతోన్న వారిలో సందీప్ రెడ్డి వంగా కనిపిస్తున్నాడు.అర్జున్ రెడ్డి తో ట్రెండ్ సెట్ చేసిన ఈ దర్శకుడు ..కబీర్ సింగ్ తో అటు బాలీవుడ్ బ్యాచ్ ను ఆకట్టుకున్నాడు.ఆతర్వాత మరో హిందీ ప్రాజెక్ట్ కు కమిట్ అవ్వాలని చూశాడు గాని ..అక్కడ ఎవ్వరు మనోడితో రిస్క్ చేయాలనుకోలేదు.దీంతో మళ్లీ తెలుగు పరిశ్రమకే వచ్చి ఇక్కడే సినిమా చేయాలనుకున్నా…అదేది వర్కవుట్ కాలేదు.ఇక చేసేది లేక మంచి కథను తయారుచేసుకుని తెలుగు టాప్ హీరోలకు మాత్రమే వినిపించాలని చూస్తున్నాడు.మరి అదైనా ఇన్ టైమ్ కు అయితే ఓకే…లేదంటే మరింత లేటై సందీప్ క్రేజ్ కు ఇబ్బంది రావచ్చు.