పూర్వ వైభవంతో కళ కళ లాడబోతున్న టాలీవుడ్ ..!

-

కరోనా మహమ్మారితో గత రెండు నెలలుగా లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ మొత్తం స్థంభించిపోయిన సంగతి తెలిసిందే. వందల కార్మీకులు షూటింగ్స్ లేక అవస్థలు పడ్డారు. ఇక నిర్మాతల పరిస్థితి చెప్పడం మహా కష్టం. చిన్న సినిమా ఆర్ ఆర్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాల వరకు అన్ని ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితి గంతంలో ఎన్నడు రాలేదు. టాలీవుడ్ కి ఇప్పట్లో కోలుకోలేని దెబ్బే. ఒక వైపు షూటింగ్ లు మరో వైపు థియోటర్స్ మూత పడడంతో అన్ని చిత్ర పరిశ్రమలు వెల వెలబోయాయి.

 

అయితే ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి, ముఖ్య మంత్రి తో టాలీవుడ్ ప్రముఖులు జరిపిన చర్చలు ఫలించడంతో మేకర్స్ కి ఊరట లభించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకోవడానికి అనుమతులు ఇచ్చిన మంత్రులు… త్వరలో షూటింగ్స్ కూడా ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. జూన్ నుంచి అన్ని సినిమాల షూటింగ్స్ మొదలయ్యో అవకాశాలున్నాయి. టీవీ, షూటింగ్స్ సినిమా షూటింగ్స్ తో మళ్ళీ చిత్ర పరిశ్రమ కళ కళ లాడబోతోంది.

 

షూటింగ్స్ మొదలైతే కరోనా నిబంధనలతో అతి కొద్దిమంది యూనిట్ పాల్గొనే సన్నివేశాలను శరవేగంగా పూర్తి చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇక ముందుగా వకీల్ సాబ్ షూటింగ్ మొదలవబోతుందని తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమాకి, ప్రభాస్ సినిమాకి సెట్స్ సిద్దంగా  ఉన్నాయి. మెగాస్టార్ సినిమా ఆచార్య, అల్లు అర్జున్ పుష్ప, పూరి విజయ్ దేవరకొండల తాజా చిత్రం, నాగ చైతన్య సాయి పల్లవిల లవ్ స్టోరీ, క్రిష్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం, నితిన్ కీర్తి సురేష్ ల రంగ్ దే, మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి ..ఇలా భారీ సినిమాల షూటింగ్ మొదలవడంతో టాలీవుడ్ కి పూర్వ వైభవం రాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news