కరోనా వేళ టాలీవుడ్ నిర్మాణ‌ సంస్థ‌ల సాయం.. ఏం చేస్తున్నారంటే!

-

క‌రోనా ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న మ‌హ‌మ్మారి. ప్ర‌పంచంలోనే రోజవారీ కేసుల్లో ఇండియా ఇప్పుడు మొద‌టి స్థానంలో ఉంది. అంటే ప‌రిస్థితులు ఎంత భ‌యంక‌రంగా ఉన్నాయో చూడండి. మ‌రోవైపు దేశ వ్యాప్తంగా.. ఆస్ప‌త్రుల్లో బెడ్ల కొర‌త‌, ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా వేధిస్తోంది. క‌రోనా వ‌స్తే అస‌లు ఏ ఆస్ప‌త్రిలో బెడ్లు ఉన్నాయో సామాన్య ప్ర‌జ‌ల‌క తెలియ‌ని ప‌రిస్థితి. ఏ హాస్పిట‌ల్ లో ఆక్సిజ‌న్ స‌రిప‌డా ఉందో తెలియ‌దు. రెమిడెసివిర్ ఎక్క‌డ దొర‌కుతుందో అర్థం కాని దుస్థితి.

ఇలాంటి టైమ్ లో మేమున్నామంటూ మ‌న టాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లు ముందుకొచ్చాయి. ముందు ఎవ‌రు మొద‌లు పెట్టారో తెలియ‌దు కానీ.. ఇప్పుడు అన్ని నిర్మాణ సంస్థ‌లు ప్ర‌జ‌ల‌కు సాయం అందిస్తున్నాయి. త‌మ అధికార సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా ప్ర‌జ‌ల‌కు బెడ్లు, ఆక్సిజ‌న్‌, రెమిడెసివిర్‌, ఇత‌ర చికిత్స‌లు, అవ‌స‌రాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని చేర‌వేస్తున్నాయి. మ‌రి కొన్ని సంస్థ‌లు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నాయి.

దిల్ రాజుకు చెందిన వెంకటేశ్వర క్రియేషన్స్, అలాగే దగ్గుబాటి సురేష్ బాబుకు చెందిన సురేష్ ప్రొడక్షన్స్ తోపాట అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, అన్న పూర్ణ స్టూడియోస్‌, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్.. ఇలా ఒక్క టేమిటి అన్ని నిర్మాణ సంస్థ‌లు త‌మ‌వంతు సాయం అందిస్తున్నాయి. కాల్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసి.. క‌రోనా పేషెంట్ల‌కు సాయం అందిస్తున్నాయి. దీంతో నెటిజ‌న్లు వారిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news