కెజిఎఫ్ -2 లో టాలీవుడ్ స్టార్ నటుడు….!!

-

కన్నడ రాక్ స్టార్ యాష్ హీరోగా 2018 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ సినిమా కెజిఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. వాస్తవానికి కన్నడ సినిమా గా పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కిన ఆ సినిమా, కన్నడతో పాటు హిందీ సహా పలు సౌత్ భాషల్లో కూడా రిలీజ్ అయి అన్ని భాషల్లోనూ అత్యద్భుత విజయాన్ని అందుకుంది. ఇక ఆ సినిమా తరువాత హీరో యాష్ కు దేశవ్యాప్తంగా మంచి పేరు దక్కింది.

యువ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ సినిమాని తెరకెక్కించగా హోంబేలె ప్రొడక్షన్స్ సంస్థ దానిని ఎంతో భారీగా నిర్మించింది. ఇక ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా కెజిఎఫ్ చాప్టర్ 2 మరింత భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పలువురు బాలీవుడ్ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో మన టాలీవుడ్ నుండి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ ఆ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ చేయడం జరిగింది.

 

వెల్కమ్ రావు రమేష్ గారు, మీరు మా సినిమాలో ఒక భాగం అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ రావు రమేష్ తో కలిసి దిగిన ఒక ఫోటోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు ప్రశాంత్. ఇక ప్రస్తుతం ఆ ఫోటో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా, మే లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం….!!

Read more RELATED
Recommended to you

Latest news