వాస్తవానికి బాలీవుడ్ తర్వాత టాలీవుడ్‌కే ఆ స్థానం దక్కుతుంది. ఒకప్పుడేమో గానీ ఇప్పుడు టాలీవుడ్ స్థాయి చాలా రెట్లు పెరిగింది. ఈ క్రమంలోనే మన ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోల రెమ్యునరేషన్ కూడా పెరుగుతూ వస్తోంది. అయితే ఆ హీరోకి ఎంత రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది? ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు? అసల టాప్ లిస్ట్‌లో ఎవరు ఉన్నారు? అన్న ప్రశ్నలు చాలా మంది ఫ్యాన్స్‌లో ఉంటాయి. ఇక దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోల పారితోషికం అయితే ఆకాశాన్ని టచ్ చేస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఇలా ఉన్నాయి..
టాలీవుడ్‌ను ఏలుతున్న అగ్రహీరోల రెమ్యునరేషన్స్‌ను పరిశీలిస్తే.. యంగ్ రెబల్ స్టార్ దాదాపు రూ. 65 కోట్లు, సూపర్‌స్టార్ మహేష్ బాబు రూ. 54 కోట్లు, రామ్ చరన్ రూ. 40 కోట్లు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ. 40 కోట్లు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25 కోట్లు, విక్టరీ వెంకటేష్ రూ. 8 కోట్లు, అక్కినేని నాగార్జున రూ. 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
అలాగే నేచురల్ స్టార్ నాని 12 కోట్లు, విజయ్ దేవరకొండ రూ. 10 కోట్లు, నందమూరి బాలకృష్ణ రూ. 6 కోట్లు, రవితేజ రూ. 6 కోట్లు, శర్వానంద్ రూ. 4 కోట్లు, ఎనర్జిటిక్ స్టార్ రామ్ రూ. 4 కోట్లు, వరుణ్ తేజ్ రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ఫిలిం నగర్ టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై క్లారీటీ రావాల్సి ఉంది.