జైపూర్ కు కదిలిన టాలీవుడ్..!

-

టాలీవుడ్ హీరోలంతా ఒక్కొక్కరుగా టాలీవుడ్ చేరుకుంటున్నారు. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్ కార్తికేయ మ్యారేజ్ రేపు అనగా డిసెంబర్ 30న జైపూర్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటెల్ లో జరుగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్స్ అంతా అటెండ్ అవుతుండటం విశేషం. తన డైరక్షన్ లో నటించిన ప్రభాస్, అనుష్క, ఎన్.టి.ఆర్, రాం చరణ్, రానా, నాని ఇలా అందరు జైపూర్ కు చేరుకున్నారు.

రాజమౌళి కోసం స్టార్స్ అంతా తమ పనులన్ని పక్కన పెట్టి ఓ చోట చేరారు. ముందు రోజే ప్రభాస్, అనుష్కలు అక్కడకు వెళ్లారని తెలుస్తుంది. రాం చరణ్, ఎన్.టి.ఆర్, రానా, నానిలు ఒకేసారి జైపూర్ చేరుకున్నారట. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇక దానికైతే టోటల్ ఇండస్ట్రీ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. మొత్తానికి రాజమౌళి ఇంట పెళ్లిసందడి తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతా ఒక దగ్గరకు వచ్చేలా చేస్తుందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news