ప్రభాస్ రియల్ డ్యాన్స్.. ఇరగదీశాడట..!

-

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ తన పెళ్లి శుభవార్త చెప్పడానికి లేట్ చేస్తున్నాడు కాని ఇతరుల పెళ్లికి మాత్రం అదరగొడుతున్నాడు. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ పెళ్లికి ప్రభాస్ అందరి కన్నా ముందే అటెండ్ అయ్యాడు. ప్రభాస్ తో పాటు అనుష్క కూడా ఈ పెళ్లి వేడుకలకు వచ్చినట్టు తెలుస్తుంది.

అయితే ఈ పెళ్లి వేడుకలో ప్రభాస్ ఉత్సాహంగా పాల్గొంటున్నాడట. అంతేకాదు బరాత్ లో డ్యాన్సులు గట్రా చేస్తున్నాడట. ప్రభాస్ లో ఈ కొత్త ఉత్సాహం చూసి అందరు షాక్ అవుతున్నారట. మితభాషిగా ఉండే ప్రభాస్ ఈ రేంజ్ లో ఎంజాయ్ చేయడం చూసి అందరు షాక్ అవుతున్నారు. ప్రభాస్ రియల్ డ్యాన్స్ గురించి ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు. సినిమాల్లో అటు ఇటుగా స్టెప్పులేసే ప్రభాస్ రాజమౌళి తనయుడి పెళ్లికి మాత్రం నాటు డ్యాన్స్ తో ఇరగదీశాడట.

మరి ఇదే ఉత్సాహంలో తను కూడా ఎవరో ఒకరిని పెళ్లాడితే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సంతోషపడతారు. వయసు 40 దగ్గరగా వచ్చినా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడం పట్ల రెబల్ స్టార్ ఫ్యాన్స్ దిగులుపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news