అలియా భట్ వేసుకున్న ఈ నైట్ సూట్ ధరెంతో తెలుసా?

-

Alia Bhatt spotted with floral night suit in airport

అలియా భట్.. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది. మొదట్లో కాస్త బొద్దుగా ఉన్నా.. ఇప్పుడు మాత్రం కాస్త బక్కచిక్కంది ఈ సుందరి. తన స్టయిలిష్ లుక్ తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే అలియా భట్… తాజాగా వేసుకున్న ఫ్లోరల్ నైట్ సూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పైన చూస్తున్నారు కదా అదే ఫోటో. ఎయిర్ పోర్ట్ లో ఈ సూట్ వేసుకొని వెళ్తుండగా కెమెరా కంటికి చిక్కింది అలియా. ఆమె వేసుకున్న ఆ నైట్ సూట్ ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాలా 2 లక్షల రూపాయలు. ఆమె పట్టుకున్న బ్యాగు విలువ లక్ష రూపాయలట. నెటిజన్లు మాత్రం వావ్.. అలియా నైట్ సూట్ లో కూడా మెరిసిపోతున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలియా ప్రస్తుతం బ్రహ్మాస్త్ర్ అనే సినిమాలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news