ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో పూర్తిగా నష్టపోయిందని అభివృద్ధి అంతా హైదరాబాద్ నగరంలో గత పాలకులు చేయడం వల్ల ఆర్థికంగా ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏపీ సీఎం జగన్ ఇటీవల పేర్కొనడం జరిగింది. ఇందువల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని ప్రస్తుత రాజధాని అమరావతి లోనే అభివృద్ధి అంత జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ విడిపోవడం గ్యారెంటీ అని రాష్ట్రంలో జరగబోయే అభివృద్ధిలో అన్ని ప్రాంతాలు భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు జగన్.
ఈ సందర్భంగా లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ మరియు జుడిషియల్ క్యాపిటల్ గా కర్నూలు ఉండాలని జగన్ తన అభిప్రాయాన్ని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయం పెద్ద రాజకీయం కావటంతో టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రముఖులు కొంత మంది సపోర్ట్ చేస్తున్నారు జగన్ నిర్ణయాన్ని.
ఆంధ్రప్రదేశ్ రాజధాని కి మూడు రాజధానులు అవసరమని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలు మరియు మెగా కాంపౌండ్ హీరోలు అదేవిధంగా హీరోయిన్లు అనుష్క డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు కొంతమంది జగన్ కి సపోర్ట్ గా మూడు రాజధానుల విషయంలో ఉండాలని డిసైడ్ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి.