యశోద మూవీలో సామ్ కాకుండా మరో నలుగురు హీరోయిన్స్… ఎవరో తెలుసా?

-

క‌థానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల‌కి కేరాఫ్‌గా మారారు స‌మంత‌. తొలినాళ్ల‌లో గ్లామ‌ర్ తార‌గా సంద‌డి చేసినా… కొన్నాళ్లుగా త‌న‌లోని న‌టిని ఆవిష్క‌రించేలా క‌థ‌ల్ని ఎంపిక చేసుకుంటూ ప్ర‌యాణం చేస్తున్నారు. ‘యూ ట‌ర్న్‌‘, ‘ఓ బేబి’ చిత్రాల త‌ర్వాత మ‌ళ్లీ ఆమె చేసిన నాయికా ప్ర‌ధాన‌మైన చిత్రం.. ‘య‌శోద‌’. ఈ సినిమాలో స‌మంత గ‌ర్భ‌వ‌తిగా న‌టించ‌డమే కాదు…పోరాటాలూ చేశారు. సినిమా పూర్త‌య్యే క్ర‌మంలో అనారోగ్యంతో ఇబ్బందిప‌డినా స‌రే.. డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేశారు. పాన్ ఇండియా స్థాయిలో మంచి ప్ర‌చారం, అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దుసుకెళ్తోంది.

అయితే ఈ సినిమాలో సామ్ కాకుండా మరో నలుగురు హీరోయిన్లు నటించారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే. ఈ సినిమాలో సమంతతో పాటు హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక నెగిటివ్ రోల్ పోషించారు. తమిళంలో శింబు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ… తెలుగులో క్రాక్ సినిమా నుంచి నెగిటివ్ పాత్రలు చేస్తూ వచ్చింది. ఆ తర్వాత నాంది, పక్కా కమర్షియల్ ఇప్పుడు రీసెంట్ గా యశోద ఇలా అన్ని సినిమాల్లో ఆమె నటిస్తూ వస్తోంది.

 

ఇక ఆ తర్వాత సమంతతో స్నేహం చేసే పాత్రలో కల్పిక గణేష్ కనిపించారు. వాస్తవానికి ఆమె కూడా ఒక హీరోయినే. నిజానికి ప్రయాణం సినిమాతో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన ఆమె ఆ తరువాత ఆరెంజ్, నమో వెంకటేశ, జులాయి, నిప్పు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇలా వరుస సినిమాలతో ఆమె ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత ఆమె మై డియర్ మార్తాండం అనే సినిమాతో హీరోయిన్ గా మారారు. అంతేకాక సీత ఆన్ ది రోడ్డు అనే సినిమాలో కూడా ఆమె ప్రధాన పాత్రలో నటించారు. అలా ఆమె కూడా ఈ సినిమాలో నటించిన మూడో హీరోయిన్.

 

ఇక వీరిద్దరూ కాకుండా ప్రియాంక శర్మ కూడా ఒక కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో సమంత, దివ్య శ్రీపాద, కల్పిక గణేష్, ప్రియాంక శర్మ వీరంతా ఒక గ్యాంగ్ లాగా కనిపిస్తారు. ఇక ప్రియాంక శర్మ విషయానికి వస్తే ఆమె గతంలో తెలుగులో సవారి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే శివకాశిపురం అనే సినిమాలో కూడా ఆమె కనిపించారు. తర్వాత ఎవరు అనే సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్ గా కనిపించింది. సమంత కాకుండా ప్రియాంక శర్మ మరో హీరోయిన్ గా ఈ సినిమాలో నటించినట్టు అయింది..

ఇక ఇదే సినిమాలో సమంత సోదరి పాత్రలో ప్రీతి అస్రాని కూడా కనిపించింది. ఊకొడతారా ఉలిక్కి పడతారా అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ప్రీతి అస్రాని ప్రెజర్ కుక్కర్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత ఏ యాడ్ ఇన్ఫిటమ్ అనే సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. అలా సమంతతో పాటు మరో నలుగురు హీరోయిన్లు యశోద మూవీలో నటించినట్టు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news