మళ్ళీ ఒకే ఒరలో రెండు కత్తులు ..?

-

నాని సాయి పల్లవి జంటగా గతంలో ఎంసీఏ వచ్చిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించగా వేణు శ్రీరాం దర్శకత్వం వహించాడు. ఫిదా లాంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమా మీద బాగా అంచనాలు ఉన్నప్పటికి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ సినిమా సమయంలో నాని సాయి పల్లవిల మద్య గొడవ జరిగిందన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఒక సీన్ విషయం లో కాంప్రమైజ్ కాకుండా నువ్వెంతంటే నువ్వెంత అన్నట్టుగా ఇద్దరు గొడవ పడ్డారట.

 

దాంతో సాయి పల్లవి ఈ సినిమా చేయనంటూ తెగేసి చెప్పిందట. దాదాపు షూటింగ్ కంప్లీటవచ్చిన సమయంలో ఇలా జరిగి హీరోయిన్ డ్రాపయితే బాగా నష్టం వస్తుందని దిల్ రాజు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి కాంప్రమైజ్ చేశాడట. అయితే ఆ తర్వాత నాని కి జంటగా కొంత మంది మేకర్స్ సాయి పల్లవిని తీసుకుందామని చూసినప్పటికి సాయి పల్లవి నిర్మొహమాటంగా చేయనని చెప్పిందట.

కాని తాజా సమాచారం ప్రకారం మళ్ళీ రెండు కత్తులు ఒకే ఒరలోకి చేరబోతున్నాయని అంటున్నారు. నాని త్వరలో టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. శ్యాం సింగ్ రాయ్ పేరుతో తెరకెక్కే ఈ సినిమా ఆగస్టు లేదా సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకి వెళ్ళబోతుందట. ఇందులో భాగంగా సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంతక ముందే ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తుందన్న వార్తలు వచ్చినప్పటికి లాక్ డౌన్ కారణంగా అధికారకంగా ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు సాయి పల్లవి ఫైనల్ అయిందని త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించబోతున్నారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news