టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు గుండెపోటుతో మరణించారు. కూకట్పల్లి లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. అలనాటి సంగీత దర్శకుడు టీవీ రాజ్ కుమారుడైన రాజ్ అసలు పేరు తోటకూరి సోమరాజు. సంగీత ప్రపంచంలో రాజ్ – కోటి ద్వయం ప్రఖ్యాతిగాంచింది.

దశాబ్దాల పాటు వీరిద్దరూ కలిసి అనేక సినిమాలకు సంగీతం అందించారు. 90వ దశకంలో వచ్చిన సినిమాలలో రాజ్ – కోటి కాంబో సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. వీరిద్దరూ మ్యూజిక్ కంపోజ్ చేస్తే పక్కా హిట్ అనే మ్యూజికల్ హిట్ టాక్ ఉండేది. వీరిద్దరూ దాదాపు 150 కి పైగా చిత్రాలకు పని చేశారు. ఆ తర్వాత కొన్ని విభేదాల కారణంగా విడిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news