మహేశ్ ‘సర్కారువారి పాట’కు ట్రైలర్ కట్ కష్టం

సౌత్ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ సినిమాల టీజర్లు ప్రేక్షకుల మతిపొగొడుతున్నాయి.టీజర్ వరకు రఫ్పాడించిన సినిమాలు… ట్రైలర్ల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ ఫీట్ ను కంటిన్యూ చేయలేకపోతున్నాయి.ఈవిషయమే ఇప్పుడు అప్ కమింగ్ సినిమాలను భయపెడుతుంది. బాలీవుడ్ తో పోల్చుకుంటే సౌత్ సినిమాలలో టీజర్ ,ట్రైలర్ కట్ సాలిడ్ గా ఉంటుంది.మనవాళ్లు మేకింగ్ లోను ,ఫిల్మీ పర్ ఫెక్షన్ లోను ఎక్కడా తగ్గరు. ఆ ఇదితోనే సౌత్ సినిమా నేడు బాలీవుడ్ ను ఢీ కొడుతు ఉంది. తాజాగా మార్కెట్లో హల్చల్ చేస్తున్న మోషన్ పోస్టర్ టీజర్లు ,టీజర్లు సినీ లవర్స్ కు మంచి పసందైన విందును అందిస్తున్నాయి.


ప్రిన్స్ మహేష్ బాబు సర్కారువారి పాటకు కూడా ఇలాగే ఊరించి ..సింపుల్ గా మోషన్ పోస్టర్ టీజర్ తో పని కానిచ్చేసారు.సీరియస్ సబ్జెక్ట్ కావడంతో ఒకటి రివీల్ చేసి ఇంకోటి రివీల్ చేయకపోతే బాగోదనుకున్నారో ఏమో…మొత్తానికి ఇన్ డైరెక్ట్ అప్రోచ్ ను ఫాలో అయ్యారు.మరి ట్రైలర్ టైమ్ వచ్చేసరికి డైరెక్టర్ పరశురామ్ ..ఎలాంటి థీమ్ ను చూపించి ప్రేక్షకులను అటెన్షన్ లోకి తీసుకువస్తాడో చూడాలి.ఇంకా అందరి దర్శకులు ముందు ట్రైలర్ ఓ సవాల్ గా మారిపోయింది.ట్రైలర్ కటింగ్ లో ఏమాత్రం తేడా వచ్చినా…ఆ టాక్ సినిమా మీద ముందుగానే పడిపోతుంది.ఆ భయంతో దర్శకులు ట్రైలర్ విషయంలో ఆవేశంతో కాకుండా కాస్త ఎక్కువ టైమ్ తీసుకుని ఆలోచనతో ముందుకు పోతున్నారు.