మాకు కూడా విరాళాలు ఇవ్వాలంటూ రజనీ ఇంటి ముందు ధర్నాలు..!!

-

ప్ర‌స్తుతం క‌రోనా కాలం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ‌దేశాలు అత‌లాకుత‌లం అవ‌తున్నాయి. కరోనా వైరస్‌ను మొదట చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబరు 1 న గుర్తించారు. ఆ త‌ర్వాత ఈ ర‌క్క‌సి దేశ‌దేశాలు వ్యాపించి.. అంద‌రినీ శాసిస్తుంది. ఈ క్రమంలోనే వేద మంది ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటుంది. ఇక దీని బాధితుల సంఖ్య ల‌క్ష‌ల్లో ఉన్నారంటే.. ప‌రిస్థితి ఎంత తీవ్ర స్థాయిలో ఉందో స్ప‌ష్టంగా అర్థం చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు క‌రోనాను నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి.

అందులో భార‌త్ కూడా ఒక‌టి. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా ఎంద‌రో ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా రోజూ కూలీలు పనిలేక.. పూట గడవక ఆక‌లితో అలమటిస్తున్నారు. దీంతో వాళ్లందరినీ కాపాడటానికి ప్రభుత్వంతో పాటు సినిమా తారాలు, రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపార‌వేత్త‌లు ఇలా ఇత‌రిత‌రులు త‌మ‌కు తోచిన సాయం చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు. ఈ లిస్ట్‌లో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ కూడా ఒక‌రు. కరోనా వైరస్‍ మహమ్మారి దెబ్బకు సినిమాల షూటింగ్స్ అన్నీ రద్దయిన సంగతి తెలిసిందే.

దీంతో చిన్న స్థాయి కళాకారులు ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే ర‌జ‌నీ.. సినీ కార్మికుల కోసం రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. దీంతో ఇప్పుడు రజనీకాంత్ ఇంటి ముందు ట్రాన్స్‌జెండర్లు ఎనిమిది మందితో ఓ గ్రూపుగా వచ్చి ధ‌ర్నా చేప‌ట్టారు. పులియన్‌తోప్‌ ప్రాంతానికి చెందిన ఈ ట్రాన్స్‌జెండర్లు మాకు కూడా విరాళాలు ఇవ్వాలంటూ రజనీకాంత్ ఇంటి ముందు ధర్నా చేశాయి. దీంతో ర‌జ‌నీ కుటుంబం ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ఇక‌ ఆ త‌ర్వాత వాళ్ల‌కు రూ.5వేలు ఇచ్చి పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news