పారాసిటమాల్ వేసుకుని కొంప ముంచేశారు…!

-

జ్వరం వస్తే తగ్గించే పారాసిటమాల్ దేశాన్ని ఇప్పుడు సర్వ నాశనం చేస్తుంది. విదేశాల నుంచి వచ్చిన వారు దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. గత నెలలో అమెరికా నుంచి ఒక అమ్మాయి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చింది. ఆమెకు అక్కడ జ్వరం ఉండటంతో ఆమెకు తెలిసిన ఒక వైద్యుడు పారసిటమాల్ వేసుకోవాలని సూచించాడు. దీనితో ఆమె ఆ బిళ్ళ వాడింది. జ్వరం పూర్తిగా తగ్గిపోయింది ఆమెకు.

ఢిల్లీ విమానాశ్రయంలో ధర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. కాని స్క్రీనింగ్ లో మాత్రం ఆమెకు కరోనా లక్షణాలు బయటపడలేదు. దీనితో హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు అధికారులు. హోం క్వారంటైన్ కి వెళ్ళిన తర్వాత కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఇళ్ళల్లో వాళ్లకు కూడా కరోనా అంటించారు. కరోనా ఉందనే విషయం బయటపడితే ప్రభుత్వ క్వారంటైన్ లో 14 రోజులు ఉంచి అప్పుడు పంపించే వాళ్ళు.

కాని జ్వరం లేకపోవడం తో ఇంటికి పంపించారు. ఢిల్లీ పెరిగిన కేసులు, మహారాష్ట్రలో పెరిగిన కేసులు అన్ని కూడా ఇలాగే ఉన్నాయి. అలాగే కేరళ, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ వలనే ఇప్పుడు దేశంలో కేసులు పెరుగుతున్నాయి అంటున్నారు. ఇలా కొంత మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. దీనితో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా క్వారంటైన్ లో ఉండాల్సిందే, వాళ్ళు రావాల్సిందే, కుటుంబాలతో సహా అని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news