మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చాడు. మెగాస్టార్ గా ఎదిగాడు. రాజకీయాల్లోకి కూడా వెళ్లాడు.కానీ రాజకీయాల్లో రాణించలేనని గ్రహించి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాడు చిరంజీవి. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. తాజాగా భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.
చిరంజీవి మోకాలి నొప్పికి ట్రీట్మెంట్ ఢిల్లీలో జరుగనుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఆర్థోస్కోపి KNEE WASH ట్రీట్మెంట్ తీసుకున్నారు చిరంజీవి. దాదాపు వారం రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత హైదరాబాద్ కి రానున్నారు. ఈనెల 22న చిరంజీవి పుట్టినరోజు. పుట్టిన రోజునే చిరంజీవి తన నూతన చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఈ సినిమాకి నిర్మాత చిరంజీవి కూతురు సుస్మిత వ్యవహరించనున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. మొత్తానికి మోకాలీ ట్రీట్ మెంట్ తరువాత చిరంజీవి మరో ప్రాజెక్ట్ చేయనున్నాడని స్పష్టమవుతోంది