ట్రిపుల్ ఆర్ : 70 శాతం క‌లెక్ష‌న్లు వ‌సూల్ ? మిగ‌తా మాటేంటో !

-

భారీ చిత్రానికి భారీ టికెట్ ధ‌ర‌
అయినా కూడా సినిమా హిట్
క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా హిట్
ఆల్ టైం రికార్డులు కూడా సొంతం
కానీ.. కొంత దిగులు ఉంది

ఎన్నడూ లేని విధంగా
సోమ‌వారం నుంచి క‌లెక్ష‌న్లు
డ్రాప్ అవుతున్నాయి
అదే ఇప్పుడు రాజ‌మౌళి కి ఉన్న ఆందోళ‌న !
ప్ర‌పంచ వ్యాప్తంగా ఇద్ద‌రు హీరోలు ఒకే ఫ్రేమ్ లో క‌నిపిస్తేనే విడ్డూరం. కానీ ఇద్ద‌రు హీరోలు కొన్ని సార్లు క‌ల‌హించుకుని,కొన్నిసార్లు ప్రేమించుకుని,కొన్ని సార్లు అభిమానం పంచుకుని కొన్ని సార్లు ప్రేమాభిమానాలు పెంచుకుని ఉంటే ఆ సినిమా పేరు ట్రిపుల్ ఆర్.

ఆ విధంగా ట్రిపుల్ ఆర్ ఎంద‌రికో నచ్చింది. మన క‌న్నా బాలీవుడ్ కు న‌చ్చింది. త‌మిళియ‌న్స్ కు ఓ మోస్త‌రుగా న‌చ్చింది. ఏ విధంగా చూసుకున్నా సినిమా క‌న్న‌డిగుల‌కు కూడా చేరువైంది. అందుకు కార‌ణం తారక్. మ‌ల‌యాళం వ‌ర‌కూ చేరినా అందుకు కార‌ణం చ‌ర‌ణ్ మ‌రియు తార‌క్. అయితే ఎన్ని భాష‌ల్లో విడుద‌ల‌యినా మాతృభాష‌లో ఈ సినిమా చేసిన వసూళ్లు సంబంధిత రికార్డులే ఓ విభిన్నం అయిన లేదా విభిన్న‌త‌కు ఆస్కారం ఇచ్చే ఆస‌క్తికి కార‌ణం. ఆ లెక్క‌న చూసుకుంటే సినిమా ఇంకా సాధించాల్సింది సారీ! వ‌సూళ్ల రూపంలో సంపాదించాల్సింది ఆ వేళ వ‌సూళ్ల వేట సాగించాల్సింది ఎంతో !

విజువ‌ల్ వండ‌ర్ అని చెప్పుకునేందుకు బాగుంది. ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ ఈ సినిమాకు నీళ్ల ప్రాయంలా ఖ‌ర్చ‌యిపోయింది అని చెప్పుకునేందుకు ఇంకా బాగుంది. అంత ఖ‌ర్చు పెట్టి తీశారు స‌రే వెనక్కు డ‌బ్బులు వ‌స్తాయా అన్న‌దే ప్ర‌ధాన ప్ర‌శ్న. కోవిడ్ కార‌ణంగా ప‌లు సార్లు వాయిదా ప‌డినా కూడా ఈ సినిమా విష‌య‌మై జ‌నంలో ఉన్న ఆస‌క్తి లేదా ఉత్సుక‌త ఎక్క‌డా త‌గ్గ‌లేదు.అంతేకాదు సినిమా విడుద‌ల త‌రువాత బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

ప్ర‌తిచోటా ఇద్ద‌రు హీరోల క‌టౌట్ల‌కూ పూల మాల‌లు వేశారు. పాలాభిషేకాలు చేశారు. అదేవిధంగా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అన్న వాగ్వాదాలకు దిగి కొన్ని చోట్ల కొట్టుకున్నారు. మ‌రికొన్ని చోట్ల త‌న్నుకున్నారు కూడా! చొక్కాలు చింపుకున్నాక సినిమా గురించి మాట్లాడుకోవ‌డం ఆపేశారు.ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రిపుల్ ఆర్ పై డిస్క‌ష‌న్ లేదు. ఫ్యాన్ మేడ్ వార్ అస్స‌లు లేదు. ఫ్యాన్ మేడ్ రాత‌లు కూడా లేవు. తుఫాను త‌రువాత ప్ర‌శాంతం అన్న విధంగా ఉందీ కాలం.

ఇక కలెక్ష‌న్ల గురించి మాట్లాడుకుంటే ఇప్ప‌టిదాకా డ‌బ్బై శాతంకు పైగా పెట్టిన పెట్టుబ‌డుల్లో డ‌బ్బులు వెన‌క్కు వ‌చ్చేశాయ‌ని అంటున్నాయి చిత్ర వ‌ర్గాలు. విడుద‌లైన మొద‌టి రెండు రోజుల‌కే వంద కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింద‌ని తేలింది. మూడో రోజుకు 130 కోట్ల‌కు పైగా షేర్ న‌మోదు చేసింది. ఇది తెలుగు రాష్ట్రాల లెక్క. ప్రీ రిలీజ్ 190 కోట్ల‌కు పైగా అయింది అని తెలుస్తోంది. ఆ లెక్క‌న ఈ సినిమా పెద్ద హిట్. కానీ డ‌బ్బులు ఇంకా రావాల్సి ఉంది. ఆ టెన్ష‌న్లో ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

Read more RELATED
Recommended to you

Latest news