వీరత్వానికి కొత్త అర్ధం.. అరవింద సమేత..!

-

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా వీరత్వానికి కొత్త అర్ధం చెబుతుంది అంటున్నాడు సినిమా దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్. యుద్ధం జరిగినప్పుడు గెలిచిన వాడి గురించి మాట్లాడుతాం.. కాని ఓడిన వాడి పరిస్థితి ఏంటి అన్నది ఈ సినిమా కథ అని అంటున్నారు.

వీరత్వం అంటే యుద్ధం గెలవడం కాదని చెప్పేలా ఈ సినిమా కథ ఉంటుందట. మొత్తానికి ఓ డిఫరెంట్ అటెంప్ట్ తోనే ఈ సినిమా వస్తుందని చెప్పొచ్చు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ కాగా.. ఈషా రెబ్బ సెకండ్ హీరోయిన్ గా నటించింది. తమన్ అందించిన సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news