జ‌న్మ‌భూమి క‌మిటీల దోపిడీ అంతా ఇంతా కాదు..

-

ఈ మాట‌న్న‌ది 30 ఏళ్లుగా టిడిపిలో ఉన్న వ్య‌క్తే

గజపతినగరం: తెలుగుదేశం ప్ర‌భుత్వంలో దోపిడీ అంతా ఇంతా కాదు.. జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో మామూలు దోపిడీ కాదు… ద‌ళారుల‌కు ఉండే గౌర‌వం పార్టీని న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌కు లేదు. ఈ మాట‌లు అన్న‌ది ఏ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడో కాదు.. సాక్షాత్తూ 30 ఏళ్లుగా టిడిపిలో ఉంటున్న విశాఖ జిల్లా నేత పెంట‌య్య‌. టీడీపీ సీనియర్‌ నేత పెంటయ్య వందలాది మంది అనుచరులతో కలిసి మంగళవారం గజపతినగరం మండలం ముచ్చర్లలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ వైఎస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం పెంటయ్య మీడియాతో మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా టీడీపీకి సేవ చేస్తున్నానని, అయినా పార్టీలో ఎలాంటి గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో విపరీతమైన దోపిడీ చేస్తున్నారని ఆగ్రహించారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే నమ్మకంతోనే తామంతా పార్టీలో చేరినట్లు తెలిపారు.

చిత్రీ పట్టిన జగ‌న్‌
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గజపతినగరం మండలంలోని ముచ్చర్లలోని వడ్రంగి కులస్థులను జ‌గ‌న్‌ కలిశారు. వడ్రండి చిత్రీ పట్టిన జ‌గ‌న్ వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక పనిముట్లు కొనుక్కునే ఆర్థిక స్థోమత లేక జీవనోపాధి కోల్పోతున్నామని వ‌డ్రంగి వృత్తిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news