తొడగొట్టి దమ్ము చూపించిన త్రివిక్రమ్ ??

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతికి విడుదలయి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే సినిమాకి సంబంధించి కలెక్షన్లు యూఎస్ మార్కెట్ లో ప్రభాస్ నటించిన బాహుబలి మరియు మహేష్ అదేవిధంగా రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులను పక్కకు తన్ని ‘అల వైకుంఠపురములో’ తాజాగా సరికొత్త హిస్టారికల్ రికార్డులు క్రియేట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

Image result for trivikram

మేటర్ లోకి వెళ్తే అల్లు అర్జున్ నటించిన కొత్త సినిమా ఎప్పుడు యూఎస్ క్లబ్బులో రెండు మిలియన్ మార్క్ కలెక్షన్ లో అడుగుపెట్టింది. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ‘అఆ’, ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత’ చిత్రాలతో మూడుసార్లు 2 మిలియన్ క్లబ్బులో చేరటం జరిగింది.

 

ఇప్పుడు ఆయన కొత్త చిత్రం ‘అల వైకుంఠపురములో’ కూడా ఈ క్లబ్బులో అడుగు పెట్టింది. ‘సరిలేరు నీకెవ్వరు’ కంటే ఒక రోజు లేటుగా రిలీజైన ‘అల..’ దాన్ని చూస్తుండగానే దాటేసి 2 మిలియన్ క్లబ్బులో చేరడం విశేషం. దీంతో మరోసారి త్రివిక్రమ్ ఓవర్సీస్లో తన దమ్మేంటో తన కొత్త సినిమా కలెక్షన్ ద్వారా తొడగొట్టి నిరూపించి నట్లయింది.