స‌మంత‌ని మార్చి ర‌ష్మిక‌కు అవ‌కాశం!

రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల యువ‌ర్ లైఫ్ వెబ్ అండ్ సోష‌ల్ మీడియాని ర‌న్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఫిట్ నెస్‌, హెల్త్ టిప్స్‌, హెల్దీ ఫుడ్‌.. ప్రొటీన్ ఫుడ్‌కి సంబంధించిన అవ‌గాహ‌న క‌ల్పిస్తూ యువ‌ర్ లైఫ్‌ని ఉపాస‌న ఇటీవ‌ల ప్రారంభించిన విష‌యం తెలిసిందే. దీనికి గెస్ట్ ఎడిట‌ర్‌గా స‌మంత‌ను నియ‌మించింది.

వ‌ర్కువుట్‌లు చేస్తూ హెల్దీ ఫుడ్‌కి సంబంధించిన టిప్స్‌ని, వంట‌కాల‌ని స‌మంత ఇటీవ‌ల ఉపాస‌న‌తో క‌లిసి ప‌రిచ‌యం చేసింది. తాజాగా సామ్ స్థానంలోకి క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌ని తీసుకొస్తోంది ఉపాస‌న‌. తాజాగా త‌ను నిర్వ‌హిస్తున్న యువ‌ర్ లైఫ్ వెబ్ పోర్ట‌ల్‌కు ర‌ష్మిక మంద‌న్న‌ని గెస్ట్ ఎడిట‌ర్‌గా నియ‌మించింది ఉపాస‌న‌.

స‌మంత త‌ర‌హాలోనే ర‌ష్మిక కూడా ప‌లు ఆరోగ్య క‌ర‌మైన రెసీపీల‌ని ప‌రిచ‌యం చేయ‌నుంద‌ట‌. మంగ‌ళ‌వారం యువ‌ర్ లైఫ్ వెబ్ పోర్ట‌ల్ లోకి ర‌ష్మిక‌కు వెల్క‌మ్ చెప్పారు. టుగెద‌ర్ ఫ‌ర్ వెల్ నెస్ అనే క్యాప్ష‌న్‌తో ఆరోగ్యాన్ని అందిద్దాం అంటూ ఆహ్వానించారు.