పిల్లలు కనడం పై సద్గురు మాటలకు షాక్ అయిన ఉపాసన.. అవసరమే లేదంటూ..?

-

ఉపాసన.. మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగా గుర్తింపు తెచ్చుకోక ముందే అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వైద్యరంగంలో ఎన్నో విధానాలను అవలంబించిన ఈమె ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకోవడంతోపాటు ఎంతో మంది పేద ప్రజలకు అండగా నిలిచింది. అంతే కాదు సహాయం చేయడంలో దానకర్ణునికి మించి గొప్ప వ్యక్తిత్వం కలదు అని చెప్పవచ్చు. అయితే అన్ని విధాలా.. అన్ని రంగాలలో ముందుండే ఉపాసన వివాహం జరిగి పది సంవత్సరాలు పూర్తయినా తల్లి కాకపోవడంతో ఈమెపై సర్వత్ర విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఉపాసన పిల్లలు కనడంపై సద్గురు అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది.

తన అభిప్రాయాన్ని సద్గురుకు వివరించక సద్గురు మాట్లాడిన మాటలకు ఉపాసన కూడా షాక్ అయింది.. ఇక సద్గురు ఏం చెప్పారు అంటే.. ఇక పెళ్లయిన ప్రతి ఒక్కరూ పిల్లలను కనాల్సిన అవసరం లేదు.. అలాగే మీకు ఒక అవార్డు ఇస్తాను. పిల్లలను కనకూడదని నిర్ణయించుకునే చాలామందికి కూడా నేను అవార్డులు ఇవ్వాలి. ఒకవేళ నువ్వు ఆడ పులివి అయితే పులి పిల్లలను కనమని చెబుతాను.. ఎందుకంటే ప్రస్తుతం భూమి మీద పులి జాతి అంతరించిపోతోంది..కానీ భూమి మీద మానవజాతికి కొదవేలేదు.. అలాంటప్పుడు పిల్లల్ని కనాల్సిన అవసరం ఏముంది .ఏదైనా ఒక జాతి అంతరించిపోతోంది అని అనుకున్నప్పుడే ఆ జాతి సంతతిని పెంచడానికి ప్రయత్నం చేయాలి.

ఇక పని చేయాలనే ఆలోచన మైండ్ లో ఉన్నప్పుడు పిల్లల్ని కనాలనే ఆలోచనలు రావు. ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న వారికి అలాంటి హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అందుకే వాళ్ళు ఏ పని లేక పిల్లల్ని కంటూ ఉంటారు.. ఇక మనం ప్రపంచానికి ఏదైనా మేలు చేస్తున్నాము అంటే అది కేవలం పిల్లల్ని కనకుండా ఉండడమే అన్నట్లుగా ఉపాసనకు సద్గురు సందేహాలకు జవాబులు ఇచ్చాడు. ఇక ఈ మాటలు విన్న ఉపాసన ఇలా మీరు చెప్పేశారు కదా.. నేను ఇంటికి వెళ్ళిన వెంటనే మా అత్తగారి నుండి మా అమ్మగారి నుండి మీకు ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పింది ఉపాసన . అందుకు సద్గురు స్పందిస్తూ ఇలా అమ్మలు, అత్తల దగ్గర నుంచి నాకు చాలా ఫోన్లే వచ్చాయి అంటూ నవ్వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news