ఉపేంద్ర దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మూవీ.. తర్వాత ఏం జరిగిందంటే?

-

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర..నటుడిగానే కాక దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యాయి. ఇక నటుడిగా ఆయనది ఒక విలక్షణమైన శైలి. హీరోగానే కాక విలన్ గానూ ఆయన చక్కటి పాత్రలు పోషించారు. తెలుగు సినిమాల్లో కీలక పాత్రలతో పాటు విలన్ రోల్స్ కూడా ప్లే చేశారు.

ఇటీవల వరుణ్ తేజ్ ‘గని’ చిత్రంలోనూ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఉపేంద్ర తెలుగులో పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.

విభిన్న కథాంశాలతో పాటు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సినిమాలు చేస్తూ దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఉపేంద్రతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ సినిమా చేయాలనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆ సినిమా ఉంటుందనుకున్నారు. ఈ విషయమై ఉపేంద్రకు చెప్పగా, తాను అప్పట్లో చేయలేకపోయానని ఉపేంద్ర చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో పిక్చర్ చేసే చాన్స్ మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని ఉపేంద్ర తెలిపారు.

ఉపేంద్రకు కన్నడతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన, దర్శకత్వం వహించిన సినిమాలు ఇతర భాషల్లోనూ విడుదలై ఘన విజయం సాధించాయి. ప్రస్తుతం ఆయన కన్నడ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలో ఓ తెలుగు బిగ్ ప్రాజెక్ట్ లో ఆయన నటించనున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news