ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. హిందీ బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న ఈమె బోల్డ్ స్టైలింగ్ అలాగే విచిత్రమైన ఫ్యాషన్ కి ప్రసిద్ధి చెందింది. ఇక డిఫరెంట్ ఔట్ఫిట్స్ తో అందరి చూపు తన వైపు తిప్పుకునే ఈ ముద్దుగుమ్మ.. అదే విధంగా ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. ఇక తన బోల్డ్ ఫ్యాషన్ తో నెట్టింట రచ్చ లేపుతూ మరింత పాపులారిటీని సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది.. ముఖ్యంగా ఎవరు ఊహించని విధంగా వస్త్రధారణలతో హాట్ ఫోటోషూట్స్ తో వీడియోలు కూడా పోస్ట్ చేసి యువత హృదయాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఎక్కువగా అర్థనగ్నంగా ఫోజులిచ్చి ఇంటర్నెట్ లో మంట పెట్టే ప్రయత్నం చేస్తోంది.
మొన్నా మధ్య శరీరంపై నూలు పోగు లేకుండా కేవలం గులాబీ రేకులను కప్పుకొని మరీ బోల్డ్ ఫోటోషూట్ ని షేర్ చేసిన ఈమె ఇటీవల కాటన్ క్యాండి, సేఫ్టీ పిన్లతో తయారుచేసిన ఔట్ఫిట్స్ ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు ఎలాంటి డ్రెస్ వేస్తుందో అని చాలామంది ఈమె కాస్ట్యూమ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు . ఇక ఆ కాస్ట్యూమ్స్ సంగతి పక్కన పెడితే ఈమె అందాల ఆరబోత కోసం క్యూ కట్టే నెటిజన్స్ కూడా ఉన్నారనడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే తాజాగా తన బాడీని ప్రదర్శిస్తూ ముఖం మరియు బ్రెస్ట్ ని డిస్కో బాల్ దుస్తులతో కవర్ చేసుకుంది. ఇక ఉర్ఫీ షేర్ చేసిన ఈ కొత్త బోల్డ్ లుక్ ఫ్యాన్స్ ని బాగా అలరించిందని చెప్పవచ్చు. షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే విపరీతమైన లైక్స్ ను కూడా సొంతం చేసుకుంది ఈ వీడియో.
ఉర్ఫీ జావేద్ కొత్త కాన్సెప్ట్ అలాగే ఆలోచనను కొంతమంది మెచ్చుకుంటుంటే.. మరికొంతమంది ఈమె ఫ్యాషన్ పై ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు రాజుకుంద్రా 2.0 అని కామెంట్ కూడా చేయడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇంస్టాగ్రామ్ వేదికగా బాగా వైరల్ గా మారుతుంది.
View this post on Instagram