మెగా154 లో ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్ !

-

గాడ్ ఫాదర్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య గా అభిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తూనా ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. మెగా 154 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ అలాగే టీజర్లు ఫ్యాన్స్ ను ఉర్రుతలూగించాయి.

కాగా దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ మూవీ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రం బృందం.ఇక మొదటి నుంచి ప్రచారంలో ఉన్న… వాల్తేరు వీరయ్య టైటిల్ నే ఫిక్స్ చేసింది చిత్ర బృందం. అయితే జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక మొత్తం మీద ఊర్వశి రౌతేలా ఇప్పుడు తెలుగు వారికి మోస్ట్ వాంటెడ్ ఐటమ్ గర్ల్ గా మారబోతుందని అంటున్నారు. చూడాలి ఇక అది ఎంతవరకు నిజమవుతుంది అనేది.

Read more RELATED
Recommended to you

Latest news