Breaking : ట్విట్టర్‌ వినియోగదారులకు షాక్‌.. నిలిచిపోయిన లాగిన్‌

-

ఇటీవల వాట్సాప్‌ సేవలు గంటన్నరపాటు నిలిచిపోవడం ఎంత పెద్ద చర్చకు దారి తీసిందో తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్‌ వంతు వచ్చింది. శుక్రవారం ట్విట్టర్‌ సేవల్లో అంతరారయం ఏర్పడింది. కొంత మంది యూజర్లు ట్విట్టర్‌ సేవలు నిలిచిపోయాయి. యూజర్లు లాగిన్‌ అవుతోన్న సందర్భంలో ఎర్రర్‌ మెసేజ్‌ చూపిస్తుంది. ‘సమ్‌థింగ్‌ వెంట్ రాంగ్‌’ అనే ఎర్రర్‌ మెసేజ్‌ చూపిస్తోంది. అయితే దీనిపై ట్విట్టర్‌ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఈ అసౌకర్యం కేవలం వెబ్‌ యూజర్లకు మాత్రమే కలిగినట్లు తెలుస్తోంది. మొబైల్‌ ఫోన్స్‌లో ట్విట్టర్‌ యాప్‌ను ఉపయోగిస్తున్న వారికి సేవలు యధావిధిగా కొనసాగుతున్నాయని సమాచారం. కేవలం కంప్యూటర్స్‌లో ఆపరేట్‌ చేసే వారికే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

Musk orders Twitter to cut infrastructure costs by $1 billion - sources |  Reuters

ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఇలాంటి సమస్య ఎదురైన విషయం తెలిసిందే. టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత కీలక మార్పులు జరుగుతున్న విషయం తెలిసిదే. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌ సేవల్లో అంతరాయం ఏర్పడడం గమనార్హం. ఇదిలా ఉంటే ఏమంటూ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ ను ఎప్పుడైతే హస్తగతం చేసుకున్నాడో అనేక మార్పులకు శ్రీకారం నంది పలికారు. ఇప్పటి వరకు ఉచితంగా ఉన్న బ్లూ టిక్ ఆప్షన్ ను పెయిడ్ గా మార్చారు. ఇకపై బ్లూ టిక్ పొందాలనుకునే వారు నెలకు 8 డాలర్లు చెల్లించాలని తెలిపారు ఎలాన్ మస్క్.

Read more RELATED
Recommended to you

Latest news