ఈ జంట తీరు వేరు. ఒకసారి ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటారు. ఇంకోసారి ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతారు. మారోసారి సారీ చెప్పి తియ్యగా మాట్లాడుకుంటారు. కానీ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటారు. వాళ్ల పర్సనల్, ప్రోఫెషనల్ జీవితానికి అదనంగా ఈ వ్యవహారాన్ని నడుపుతారు. ఎంతైనా సెలబ్రెటీల వరసే వేరు. ఇప్పుడిదంతా ఎందుకంటారా? ఇది చదవండి మరి..
ఒకరు వెండితెర ముద్దుగుమ్మ, మరొకరు క్రికెట్ సోగ్గాడు. ఒకరు మోడల్‌గా తన అందచందాలు ప్రదర్శిస్తుంటే.. మరొకరు గ్రౌండ్లో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తారు. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఈ సోషల్ మీడియా సినిమాకు నాయకానాయికలు ఊర్వశి రౌతేలా, రిషభ్ పంత్. కొన్నాళ్లుగా వీరి లవ్ ట్రాక్.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్న తీరుగా సాగుతోంది. తాజాగా ఈ జంట మళ్లీ నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది.
తాజాగా ఊర్వశి.. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో యాపిల్ పండు రంగు డ్రెస్సులో ఈ ముద్దుగుమ్మ మెరిసిపోతూ ఓ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. ఆ వీడియో కింద ‘హ్యాపీ బర్త్‌డే’ అని రాసి.. ఒక ఎర్ర బెలూన్ ఇమోజీ ఉంచింది. దానికింద 19 స్టార్ గుర్తులు పెట్టింది. కానీ ఈ విషెస్ ఎవరికో మాత్రం చెప్పలేదు. అయితే ఈ అమ్మడు అక్కడే దొరికిపోయింది. ఎలా అంటే.. ఈ రోజు టీమ్ ఇండియా వికెట్ కీపర్ పంత్ పుట్టిన రోజు.
అయితే ఆమె పోస్ట్‌లో చేసిన 19 స్టార్లకు కామెంట్ సెక్షన్లో సమాధానం ఇస్తున్నారు అభిమానులు. ఆ 19 స్టార్లకు అర్థం.. ఆర్పీ17 అని చెబుతున్నారు. అంటే 17 రిషభ్ పంత్ జెర్సీ నెంబర్ కాబట్టి దాని అర్థం అదే అని అంటున్నారు ఫ్యాన్స్. పంత్‌కే పరోక్షంగా బర్త్‌డే విషెస్ చెప్పిందని కామెంట్ చేస్తున్నారు. మరి.. ఈ నాటకీయ పరిణామాల మధ్య వీరిద్దరి కథ కంచికి ఎప్పుడు చేరుతుందో వేచిచూడాలి.
కొంతకాలం నుంచి టీమ్ఇండియా క్రికెటర్ పంత్‌తో మాటల యుద్ధానికి దిగిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.. ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ వచ్చింది. దీంతో సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైంది. అయితే రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరూ విడిపోయారని అందుకే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు పంత్‌పై సైటైర్లు వేసిన రౌతేలా.. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో.. “ఏం చెప్పాలో తెలియట్లేదు. కానీ సారీ చెప్పాలనుకుంటున్నాను. క్షమించండి” అంటూ చేతులు కట్టుకుని చెప్పింది. దీంతో ఊర్వశి.. రిషభ్‌కు క్షమాపణలు చెప్పినట్లు కథనాలు వచ్చాయి.