బ్రహ్మాస్త్ర రికార్డ్ కలెక్షన్స్… 2022లో ఈ సినిమానే నంబర్1!

-

‘బ్రహ్మాస్త్ర’ సినిమా ఇటీవల విడదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. కొత్త కాన్సెప్ట్​తో వచ్చిన ఈ సినిమాకు బాయ్​కాట్ సెగ తగిలినా.. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు నెగెటివ్ టాక్​ వచ్చినా ఆ తర్వాత కలెక్షన్లతో దూసుకెళ్లింది. దాదాపు రూ.410 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కించిన ఈ సినిమా.. అందుకు తగినట్లే వసూళ్లు రాబట్టింది.

అయితే ఈ సినిమా కలెక్షన్లపై కాస్త గందరగోళం ఎర్పడింది. ఇండివిడ్యువల్ ట్రాకర్స్​ లెక్కలు.. మూవీ నిర్మాణ సంస్థ లెక్కలు వేరు వేరుగా ఉన్నాయి. అయితే ఈ గందరగోళానికి తెరతీస్తూ ఈ సినిమా కలెక్షన్ల లెక్కలను ప్రకటించారు దర్శకుడు అయాన్‌ ముఖర్జీ. “నంబర్‌ 1 హిందీ మూవీ ఆఫ్‌ 2022. కృతజ్ఞతలు. హ్యాపీ నవమి” అనే క్యాప్షన్‌తో అయాన్‌ ఈ కలెక్షన్ల కొత్త పోస్టర్‌ను పోస్ట్‌ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా 25 రోజుల్లో బ్రహ్మాస్త్ర రూ.425 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టినట్లు చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా భూల్‌ భులయ్యా 2, ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలు సాధించిన కలెక్షన్ల కంటే ఎక్కువ మొత్తం బ్రహ్మాస్త్రకు వచ్చినట్లు అయాన్‌ వెల్లడించాడు.

ఒక్క బహ్మాస్త్ర పార్ట్​-1 కే 410 కోట్లు ఖర్చు చేసినట్లు అందరూ అనుకుంటున్నారు. అయితే ఇందులో పార్ట్​-2 ప్రీ ప్రొడక్షన్​ ఖర్చులూ ఉన్నట్లు దర్శకుడు అయాన్, రణ్​బీర్ కపూర్ ఇటీవల వెల్లడించారు. ఈ సినిమా క్లైమ్యాక్స్‌ను తొలి షెడ్యూల్‌లోనే చిత్రీకరించిన తర్వాత సినిమా విజువల్ ఎఫెక్ట్స్‌ బడ్జెట్‌ మూడింతలు అయినట్లు డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ చెప్పాడు. అయితే దీనికి ఇంత భారీ మొత్తం ఖర్చవుతుందని ఎవరూ ఊహించలేదని అన్నాడు. ఇక బ్రహ్మాస్త్ర ఫ్రాంఛైజ్‌లో రెండో సినిమా 2025 దీపావళికి, మూడో సినిమా 2026 క్రిస్మస్‌కు రానున్నట్లు కూడా తెలిపాడు.

అయితే ప్రపంచ వ్యాప్తంగా హిందీలో ముందున్న ఈ సినిమా.. భారత్​లో.. కశ్మీర్ ఫైల్స్​ సాధించినంత కూడా వసూలు చేయలేదు. ఇక హిందీ మార్కెట్​లో సైతం ఆర్​ఆర్​ఆర్​, కేజీఎఫ్​ సినిమాల కంటే వెనుకబడే ఉందని విశ్లేషకులు అంటున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

Read more RELATED
Recommended to you

Latest news