బ్యూటిఫుల్ హీరోయిన్ వాణికపూర్..బాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ఈ భామ వెండితెరపైన కనబడితే చాలు..సినీ అభిమానులు అలా చూస్తుండిపోయేంత అందం ఈమె సొంతం కావడం విశేషం. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లో కనబడి కుర్రకారు మతి పోగొట్టె ఈ సుందరి తాజాగా సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో మెరిసింది.
చీరకట్టులోనూ ఈ సుందరి దగ దగ మెరిసిపోతున్నది. అలా వయ్యారంగా చీరకట్టులోనూ ఫోజులిస్తూ కుర్రకారు చూపు తిప్పుకోనివ్వడం లేదు ఈ భామ. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి అలా బ్యాక్ అందాలు చూపుతూ, ఓరగా ఓ కంట కనిపెడుతూ, అటు వైపునకు చూస్తూ, ఇటు వైపునకు చూస్తూ వాణికపూర్ తన అందాలతో పిచ్చెక్కిస్తున్నది.
ఈ రోజు విశేషాలు అనే క్యాప్షన్ తో వాణికపూర్ ఈ చీరకట్టు ఫొటోలు ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘సెక్సీ, స్టన్నర్, బ్యూటిఫుల్, గార్జియస్, సో ప్రెట్టీ, నైస్ లుకింగ్, వావ్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోను టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా లైక్ చేసింది.
ఈ భామ ఇటీవల ‘షంషేరా’ చిత్ర షూటింగ్ కంప్లీ్ట్ చేసింది. ఇందులో రణ్ బీర్ కపూర్ కు జోడీగా నటించింది ఈ సుందరి. ఈ చిత్ర విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. హిందీ ప్రేక్షకులకు ఈ భామ చివరగా ‘ఛండీఘర్ కరే ఆశికి’ చిత్రంలో కనిపించింది. అంతకు ముందర బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ ఫిల్మ్ లో కనిపించింది.
https://www.instagram.com/p/Ccc15D2v9u2/