తెలంగాణ మత్స్యకారుల కోసం ‘హెల్ప్‌లైన్’ ఏర్పాటుకు నిర్ణయం

-

తెలంగాణ మత్స్యకారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్‌ సర్కార్‌. మత్స్యకారులకు ప్రభుత్వ పథకాల సమాచారం అందించడంతోపాటు… వారి సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ ప్రారంభించాలని రాష్ట్ర మత్స్యశాఖ నిర్ణయించింది. ఈనెల 10న జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ హెల్ప్ లైన్ ప్రారంభించనున్నారు. తోలుత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు… తర్వాత నిరంతర సేవలు ఉంటాయని అధికారులు తెలిపారు.

తెలంగాణ  రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. అటు.. తెలంగాణలో ఎరుకుల వర్గం కోసం ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఎరుకుల వర్గ సాధికారత కోసం రూ. 60 కోట్లతో పథకాలు అమలు చేయనున్నట్లు ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్ తెలిపారు. ఈ నిధులను ప్రాథమిక పందుల పెంపకదారుల సంఘాలకు అందిస్తారు. శాస్త్రీయ పద్ధతుల్లో పందుల పెంపకం కోసం సామాజిక స్థాయిలో అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక సాయం అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news