అభిమానికి వంట‌ల‌క్క స‌ర్‌ప్రైజ్‌గిఫ్ట్‌!

వంట‌ల‌క్క.. స్టార్ మాలో ప్ర‌సారం అయ్యే `కార్తీక దీపం` చూసే ప్రేక్ష‌కుల‌కు ఈ పేరు సూప‌రిచిత‌మే. సినిమా హీరోయిన్ స్టాయిలో పాపుల‌ర్ అయింది. ఈ ఛాన‌ల్‌లో ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్స్‌ల‌లో టాప్ పొజీష‌న్‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ద‌క్కించుకున్న‌ సీరియ‌ల్ ఇదే. ప్ర‌తీరోజు రాత్రి 7:30 అయ్యిందంటే చాలు మ‌హిళ‌లంతా టీవీల ముందు ప్ర‌త్య‌క్ష్యం కావాల్సిందే. అంత‌లా ఈ సీరియ‌ల్ పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఇదే టైమ్‌లో ఐపీఎల్ స్టార్ట్ కావ‌డంతో భ‌ర్త‌ల‌కు, క్రికెట్ అభిమానుల‌కు పెద్ద అడ్డంకిగా మారింది. ఈ సీరియ‌ల్ కార‌ణంగా ఐపీఎల్ చూడ‌లేక‌పోతున్నామ‌ని, టైమింగ్‌ని మార్చ‌‌మ‌ని సూర్య‌పేట‌కు చెందిన ప‌విత్ర‌పు శివ‌చ‌ర‌ణ్‌ ఏకంగా సౌర‌భ్ గంగూళీకి విజ్ఞ‌ప్తి చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం కాస్తా వంట‌ల‌క్క పాత్ర‌ధారి ప్రేమి విశ్వ‌నాథ‌న్ చెవిన ప‌డింది. త‌న సీరియ‌ల్‌ని ఇంత‌లా అభిమానించే అభిమాని నిరాశ ప‌డ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుని శివ‌చ‌ర‌ణ్ కు 32 అంగుళాల టీవీని ప్ర‌త్యేకంగా కొని అత‌ని ఇంటికి పంపించింది. దీంతో శివ‌చ‌ర‌ణ్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయ‌ట‌. టీవీతో పాటు అత‌న్ని అభినందిస్తూ ఓ ఉత్త‌రాన్ని కూడా పంప‌డంతో శివ‌చ‌ర‌ణ్  కుటుంబం సంబ‌రాల్లో మునిగితేలుతోంది.