కోలీవుడ్ లో హీరోయిన్ గా ప్రతిభ చాటుకుంటున్న సిని వారసురాలు వరలక్ష్మి శరత్ కుమార్ ఈమధ్య హీరోయిన్ గా కాకుండా సినిమాల్లో స్పెషల్ రోల్స్ కు సై అంటుంది. రీసెంట్ గా రిలీజైన పందెం కోడి-2 తో పాటుగా విజయ్ సర్కార్ సినిమాలో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వరలక్ష్మి కథానాయికగా తాను ఇంకా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తానని అంటుంది. అంతేకాదు రాజకీయాల్లో కూడా వచ్చే ఆలోచన ఉందని చెప్పారు. అయితే అది ఇప్పుడు కాదని ఐదేళ్ల తర్వాత పాలిటిక్స్ లోకి వస్తానని చెబుతుంది వరలక్ష్మి. ఇక రాజకీయాల్లో తనకు స్పూర్తి జయలలితే అని అంటుంది. ప్రస్తుతం జయలలిత బయోపిక్ లో ఆమె నటిస్తుంది అందుకని ఆమె స్పూర్తి అనడం లేదని తాను రాజకీయాల్లోకి రావాలనుకునేది ఆమె స్పూర్తితోనే అంటుంది వరలక్ష్మి.
మరి జయలలిత బయోపిక్ లో నటించినంత మాత్రానా తమిళ ప్రజలకు వరలక్ష్మి అమ్మ అవుతుందా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా పాలిటిక్స్ లో వచ్చిన్ తన సత్తా చాటాలనుకుంటున్న వరలక్ష్మికి మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.