ప్రపంచంలోనే అప్ డేటెడ్ టెక్నాలజీతో.. సరికొత్త విధానంలో నిర్మిస్తున్నారు హైదరాబాద్ మెట్రోను. ఇప్పటికే రెండో మార్గాల్లో మెట్రో ప్రారంభం కూడా అయింది. నాగోల్ టు మియాపూర్ ఒక కారిడార్, ఎల్బీనగర్ టు అమీర్‌పేట మరో కారిడార్ ప్రారంభమయింది. ప్రయాణికులు కూడా మెట్రోను ఉపయోగించుకుంటున్నారు. రోజు రోజుకు మెట్రోకు ఆదరణ పెరుగుతోంది. దీంతో త్వరగా అమీర్ పేట టు హైటెక్ సిటీ కారిడార్‌ను ప్రారంభించడానికి ఎల్‌అండ్‌టీ రెడీ అవుతోంది. అమీర్ పేట టు హైటెక్ సిటీకి 11 కిలోమీటర్లు. హైదరాబాద్ ఐటీకి ఎంత ఫేమసో తెలుసు కదా. బెంగళూరు తర్వాత ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న సిటీ హైదరాబాద్. ఎక్కువ ఐటీ కంపెనీలు కూడా హైటెక్ సిటీ ప్రాంతంలోనే ఉండటంతో ఆ రూట్‌కు బాగా డిమాండ్. ఇక.. డిసెంబర్ లోనే ఈ రూట్ ను ప్రారంభించడానికి ఎల్‌అండ్‌టీ రెడీ అవుతుండటంతో ఐటీ ఉద్యోగులకు ఇది వరం కానుంది. దీని తర్వాత జేబీఎస్ టు ఎంజీబీఎస్ మార్గంలో 10 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించి మెట్రో మొదటి దశను పూర్తి చేయనున్నారు. అనంతరం మెట్రో రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్, బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకపూల్, నాగోల్ టు ఎల్బీనగర్, ఎల్బీనగర్ టు ఫలక్‌నుమాకు మెట్రో మార్గాన్ని వేయనున్నారు.