జగన్ ప్రమాణ స్వీకారానికి వస్తున్నా.. మాజీ సీఎం అక్కడ కనిపిస్తారనుకుంటున్నా: వర్మ

-

రామ్ గోపాల్ వర్మ… ఎవరైనా సరే.. వాళ్ల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో దిట్ట. వేదిక ఏదైనా సరే.. పంచ్ వేశాడంటే అంతే.. ఎదుటి వాళ్లు ఎవరైనా సరే.. ఆయన పంచ్ కు బలవ్వాల్సిందే. ఆయన ఎక్కువగా ట్విట్టర్ లో తన అస్త్రాలను సంధిస్తుంటారు.

తాజాగా.. ఆయన ఓ ట్వీట్ చేశారు. ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇవాళ విజయవాడ వస్తున్నానంటూ ట్వీట్ చేశారు. మొదటి సారి పొలిటికల్ ఈవెంట్ కు హాజరవుతున్నానని తెలిపారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి వస్తున్నా. ఏపీ మాజీ ముఖ్యమంత్రి అక్కడ కనిపిస్తారని అనుకుంటున్నా.. అంటూ చంద్రబాబుపై బాంబు పేల్చారు వర్మ.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో చంద్రబాబుకు వర్మ బద్ధ శత్రువు అయ్యారు. ఈనేపథ్యంలో సినిమాను ఏపీలో రిలీజ్ కాకుండా చేసింది చంద్రబాబే అని ఎన్నికల సమయంలో వార్తలు వచ్చాయి. తర్వాత ఎన్నికల ముగిశాక.. వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మే 31న జగన్ ప్రమాణ స్వీకారం తర్వాత ఏపీలో రిలీజ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news