బాలకృష్ణ వర్సెస్ నాగబాబు.. వరుణ్ తేజ్ ఏమన్నాడు..?

-

ఈమధ్య బాలకృష్ణ ఎవరో తెలియదు అంటూ మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్ అందరికి తెలిసిందే. నాగబాబు అలా కామెంట్ చేయడానికి ఇదవరకు పవన్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ అనడమే అని కూడా అందరికి అర్ధమైంది. అయితే కొందరు నందమూరి ఫ్యాన్స్ నాగబాబుని ట్రోల్ చేస్తున్నారు. మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య మళ్లీ రచ్చ మొదలైంది. అయితే ఈ వివాదంపై స్పందించిన వరుణ్ తేజ్ టంగ్ స్లిప్ అయ్యాడట.

ప్రస్తుతం అంతరిక్షం రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ కు ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో బాలకృష్ణ, నాగబాబు కామెంట్స్ గురించి స్పందన అడిగారట. దానిపై తండ్రికి సపోర్ట్ ఇస్తూ వరుణ్ తేజ్ మాట్లాడాడట. అయితే ఇంటర్వ్యూ అయ్యాక తన పి.ఆర్.ఓతో అది కట్ చేయమని చెప్పించాడట. సినిమా రిలీజ్ ముందు ఇలాంటివి అనవసరమైన రచ్చకు దారి తీస్తాయని వరుణ్ తేజ్ అది కట్ చేయమని చెప్పాడట. ఇంతకీ వరుణ్ తేజ్ ఏమన్నాడు అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.

Read more RELATED
Recommended to you

Latest news