ఏపీలో సిలికాన్ సిటీ…చంద్రబాబు

-


నెల్లూరు-తిరుపతి-చెన్నైలను కలుపుతూ ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు సిలికాన్‌ సిటీ అని పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుపతిలో రూ.2,200 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న టీసీఎల్‌ సంస్థ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గురువారం భూమి పూజ చేశారు.దీని ద్వారా ఏపీలో 8 వేల మందికి టీసీఎల్ ఉపాధి కల్పించనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వివిధ కంపెనీల ద్వారా వేల మందికి ఉపాధి లభించనుందన్నారు.

ఒక్క చిత్తూరు జిల్లాలోనే 20 వేల ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు.ప్రపంచంలోనే పారిశ్రామిక నగరంగా షెంజెన్‌ నగరానికి పేరుంది. ఇలాంటి పారిశ్రామిక వాతావరణాన్నే ఇప్పుడు మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో కల్పించనున్నామన్నారు. భవిష్యత్తులో నెల్లూరు-తిరుపతి-చెన్నై మంచి ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా మారబోతోంది. దీనికి సిలికాన్‌ సిటీగా నామకరణం చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news