కండలు చూపిస్తున్న వరుణ్ తేజ్.. అల్లు బాబి నిర్మాతగా మూవీ..!

-

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో వ్యక్తి ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. అల్లు అరవింద్ తనయుడు బాబీ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. అయితే అది హీరోగా కాదు నిర్మాతగా అని తెలుస్తుంది. ఇప్పటికే అల్లు ఫ్యామిలీ నుండి అల్ల్ అర్జున్ స్టైలిష్ స్టార్ గా మెగా ఫ్యాన్స్ తో పాటుగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఇక అల్లు శిరీష్ కూడా హీరోగా నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుండి తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని నిర్మాతగా అడుగుపెడుతున్నాడు అల్లు బాబి. మొదటి సినిమానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో స్టార్ట్ చేస్తున్నాడట. మెగా హీరోల్లో వరుణ్ తేజ్ సరికొత్త కథలతో ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. అందుకే వరుణ్ తేజ్ తో క్రేజీ మూవీ చేసేందుకు సిద్ధమయ్యాడు బాబి.

ఈ సినిమాకు నూతన దర్శకుడు కిరణ్ డైరెక్ట్ చేయబోతున్నాడట. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కండలు తిరిగే దేహ దారుడ్యంతో కనిపిస్తాడట. మరి అల్లు కాంపౌండ్ నుండి అరవింద్ కాకుండా నిర్మాతగా మొదటి ప్రయత్నం చేస్తున్న బాబి ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news