చిరంజీవికి బాలకృష్ణ ఫోన్..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ ఆడియోలో నందమూరి ఫ్యామిలీతో పాటు సినిమా పరిశ్రమ పెద్దలు కొందరు ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ఎందుకు పాల్గొనలేదు. అసలు ఎన్.టి.ఆర్ చిరంజీవికి ఇన్విటేషన్ పంపాడా లేదా.. పంపితే చిరంజీవి ఎందుకు మిస్సయ్యాడు అన్న డౌట్లు రావడం కామనే. బాలకృష్ణ నటించడమే కాకుండా నిర్మించిన ఎన్.టి.ఆర్ బయోపిక్ పై మరింత ఎక్కువ బాధ్యత మీద వేసుకున్నాడు.

అందుకే ఈ ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని కూడా రమ్మని పిలిచాడట. స్వయంగా బాలకృష్ణ ఫోన్ చేసి చిరంజీవిని రమ్మన్నాడట. అయితే సైరా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల తను రావడం కుదరదని చెప్పాడట చిరంజీవి. రాజకీయాల పరంగా ఎన్ని ఉన్నా బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరు మంచి అండర్ స్టాండింగ్ తో ఉంటారని ఎప్పటి నుండో తెలిసిన విషయమే ఎన్.టి.ఆర్ ఆడియోకి చిరంజీవి వచ్చి ఉంటే సీన్ మరోలా ఉండేది. మరి పైకి చెప్పిన కారణాల వల్లే చిరంజీవి ఎన్.టి.ఆర్ ఆడియోకి రాలేదా లేక మరే కారణమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news