విలన్ గా వరుణ్ తేజ్

-

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విలన్ గా నటిస్తున్నాడా హీరోగా కెరియర్ సూపర్ ఫాంలో ఉన్న ఈ మెగా హీరో విలన్ గా మారాల్సిన అవసరం ఏముందని ఆశ్చర్యపోవచ్చు. కోలీవుడ్ హీరోల్లా ప్రయోగాలు చేయాలని ఉత్సాహపడుతున్న వరుణ్ తేజ్ ఓ తమిళ్ రీమేక్ సినిమాలో ప్రతినాయకుడిగా ఓకే చెప్పాడని ఫిల్మ్ నగర్ టాక్. కోలీవుడ్ లో సిద్ధార్థ్ హీరోగా నటించిన సినిమా జిగుర్తండా. సినిమాలో హీరోగా సిద్ధార్థ్ నటించినా విలన్ గా చేసిన బాబి సింహాకు ఎక్కువ పేరు వచ్చింది.

ఆ సినిమా తెలుగు రైట్స్ దిల్ రాజు దగ్గర ఉన్నాయి. అయితే ఆ సినిమాలో బాబి సింహా రోల్ లో వరుణ్ తేజ్ చేసేందుకు సై అన్నాడట. దిల్ రాజు బ్యానర్ లో ఫిదా హిట్ అందుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు ఎఫ్-2 సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు చెప్పడంతో జిగుర్తండా రీమేక్ కు ఓకే చెప్పాడని తెలుస్తుంది. అయితే సిద్ధార్థ్ పాత్రని తెలుగులో కొద్దిగా తగ్గించి విలన్ క్యారక్టర్ ఇంకాస్త పెంచుతారట. మరి సిద్ధు పాత్రలో ఎవరు నటిస్తారు అన్నది ఇంకా తెలియలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version