గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా తాజాగా జనవరి 12న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎక్కడా చూసినా బాలయ్య సినిమా గురించే చర్చ నడిచింది. మొదటి రోజు నుండే వసూళ్ళు కూడా అనుకున్నట్టే అదరగొట్టాయి.
మ రో వైపు ఈ సినిమా లోని డైలాగ్స్ పై ప్రభుత్వం కూడా ఒక కన్ను వేసింది. ఇది కలకలం రేపింది. ఇక ఈ సినిమా వసూళ్ళు చూసుకుంటే కొద్దిగా చిరంజీవి సినిమా ఉండటం వల్ల కొంచం తగ్గిపోయాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే 100 కోట్లు వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ ను కూడా అందుకుంది. ఇక ఈ సినిమా ను బాలయ్య అభిమానిగా చేసానని గోపిచంద్ మలినేని చెప్పిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ పాత్రకు ఒక డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ స్ఫూర్తి అని తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో గోపి చెప్పారు. ఆ నాయకుడే పరిటాల రవి అని రీవిల్ చేశారు. పరిటాల రవీంద్ర సిగరెట్ తాగే స్టైల్ డేరింగ్ యాటిట్యూడ్ వంటి కొన్ని నిజ జీవిత సంఘటనలను తీసుకుని వీరసింహా రెడ్డి పాత్రకు సెట్ చేసానని చెప్పాడు. అలాగే ఆయన ప్రజల్లో ఆయన చాలా ధైర్యంగా తిరిగేవారని కూడా అనేవారు.అలాగే పరిటాల రవి జీపుకి ఆనుకుని స్టైల్‌గా సిగరెట్ తాగే ఫొటోను తాను దినపత్రికల్లో చూశానని.. ఆ ఫోటోనే ఇంటర్వెల్ సీన్ కి ప్రేరణ అని అన్నారు. బాలయ్య పాత్ర ఇంటర్వెల్లో చనిపోతూ కూడా స్టైల్ గా చుట్ట తాగుతుంది ఆ సీన్ కూడా పరిటాల రవి గారిని గట్స్ చూసే పెట్టానని అసలు సీక్రెట్ చెప్పాడు.