బిగ్ స్క్రీన్ పై పవన్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ షో.. పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ మొదటి భాగాన్ని ఫిబ్రవరి 3వ తేది నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆహా వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన పార్టు 1 ప్రోమోను కూడా విడుదల చేసింది.

పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ తో ఎపిసోడ్ ప్రారంభం అవ్వగా.. బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ” ఈశ్వర పవనేశ్వర” అంటూ జపించారు. ఇక పవన్ కళ్యాణ్ “నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు” అంటూ బాలకృష్ణ డైలాగ్ ని చెప్పారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే పవన్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్ల వద్ద పండగ వాతావరణం ఉంటుంది. ఈరోజు అన్ స్టాపబుల్ షో పవన్ ఎపిసోడ్ రిలీజ్ కానుంది. ఈ ఎపిసోడ్ పార్ట్ 1 ను ప్రసాద్ ల్యాబ్స్ లో ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు స్క్రీనింగ్ చేయనున్నట్లు సమాచారం. మొదటిసారి ఓషో ఎపిసోడ్ ను థియేటర్ లో ప్రదర్శిస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news